Published on Nov 14, 2024
Current Affairs
శంషాబాద్‌ విమానాశ్రయానికి అంతర్జాతీయ పురస్కారాలు
శంషాబాద్‌ విమానాశ్రయానికి అంతర్జాతీయ పురస్కారాలు

సౌదీ అరేబియాలోని రియాద్‌లో 2024, నవంబరు 12న జరిగిన సౌదీ ఎయిర్‌పోర్ట్‌ ఎగ్జిబిషన్‌-2024లో ఎయిర్‌పోర్ట్‌ ఎక్సెలెన్స్‌ పురస్కారాలను ప్రకటించారు.

వాటిలో ఇన్నోవేషన్‌ అండ్‌ టెక్నాలజీ, ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌ విభాగాల్లో డిజిటల్‌ ట్విన్‌ విజేతగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నిలిచింది.

ఎయిర్‌పోర్ట్‌ రెవెన్యూ మేనేజ్‌మెంట్‌ విభాగంలో స్మార్ట్‌ ట్రాలీ రన్నరప్‌ స్థానం కూడా దక్కింది. ఒకేసారి మూడు అంతర్జాతీయ పురస్కారాలు శంషాబాద్‌ విమానాశ్రయానికి దక్కాయి.