Published on Sep 20, 2024
Current Affairs
‘శ్వేత విప్లవం 2.0’
‘శ్వేత విప్లవం 2.0’

భారత పాడి పరిశ్రమ అభివృద్ధితో పాటు, పాల ఉత్పాదకతను మరింత పెంచేందుకు ‘శ్వేత విప్లవం 2.0’ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా 2024, సెప్టెంబరు 19న ఆవిష్కరించారు. మహిళా సాధికారత, ఉపాధి అవకాశాలే లక్ష్యంగా దీనికి శ్రీకారం చుట్టినట్లు ఆయన పేర్కొన్నారు. 

* పాల వ్యాపారుల కోసం దేశవ్యాప్తంగా రూపే కిసాన్‌ క్రెడిట్‌ కార్డులను తీసుకొచ్చారు. దీంతో పాటు డెయిరీ కో-ఆపరేటివ్‌ సొసైటీల్లో మైక్రో- ఏటీఎంల ఏర్పాటును అమిత్‌ షా ప్రారంభించారు. 67,930 ప్రైమరీ అగ్రికల్చర్‌ క్రెడిట్‌ సొసైటీల కంప్యూటరీకరణ కోసం ప్రామాణిక ఆపరేటింగ్‌ విధానాలను విడుదల చేశారు.