ములుగు (వీ & ఎం), సిద్దిపేట జిల్లాలోని శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ యూనివర్సిటీ (ఎస్‌కేఎల్‌టీజీహెచ్‌యూ) అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
వివరాలు:
అసిస్టెంట్ ప్రొఫెసర్: 79 పోస్టులు
విభాగాలు: అగ్రికల్చరల్ ఎకనామిక్స్, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్, అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్, అగ్రోనమీ, బయోకెమిస్ట్రీ, క్రాప్ ఫిజియాలజీ, ఎంటమాలజీ, ఫ్లోరికల్చర్, ఫ్రూట్ సైన్స్, జెనెటిక్స్ & ప్లాంట్ బ్రీడింగ్, మైక్రోబయాలజీ, ప్లాంట్ పాథాలజీ, పీఎస్‌ఎంఏ, సాయిల్ సైన్స్ & అగ్రికల్చరల్ కెమిస్ట్రీ, స్టాటిస్టిక్స్, వెజిటబుల్ సైన్స్.
అర్హతలు: అభ్యర్థులు హార్టికల్చర్ / అగ్రికల్చర్ / అగ్రికల్చరల్ ఇంజినీరింగ్‌లో 4 సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీతో పాటు ఉద్యోగానుభవం కలిగి ఉండాలి. నెట్ అర్హత తప్పనిసరి. పీహెచ్‌డీ ఉన్న వారికి నెట్ మినాహాయింపు ఉంటుంది.
వేతనం: నెలకు రూ.57,700- రూ.1,82,400.
ఎంపిక విధానం: సెల్ఫ్ అసెస్‌మెంట్ స్కోర్ కార్డ్ ఆధారంగా షార్ట్‌లిస్ట్, బోధానానుభవం, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు ఫారమ్ డౌన్‌లోడ్ చేసి, అవసరమైన ధ్రువపత్రాలతో కలిసి డిమాండ్ డ్రాఫ్ట్ (DD) జతచేసి, రిజిస్ట్రార్ కార్యాలయానికి పోస్టు ద్వారా పంపించాలి.
దరఖాస్తు ఫీజు: ఓసీ/బీసీ అభ్యర్థులకు రూ.3,000; ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు రూ.2,000.
దరఖాస్తు చివరి తేదీ: 31.01.2026.
పరీక్ష/ఇంటర్వ్యూ కేంద్రం: శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ యూనివర్సిటీ, ములుగు (వీ & ఎం), సిద్దిపేట జిల్లా.
Website: https://skltghu.ac.in/