ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్కు ఫిజీ దేశ పురస్కారమైన ‘ఆనరరీ ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ’ లభించింది. శ్రీశ్రీకి ఈ పురస్కారాన్ని ఆ దేశాధ్యక్షుడు రతు విలియమ్ మైవలిలీ కటోనివేర్ అందించారు.
* మానవ సమాజంలో స్ఫూర్తిని, వివిధ వర్గాల మధ్య శాంతి సామరస్యాలను పెంపొందించేందుకు చేస్తున్న కృషికి గాను శ్రీశ్రీకి ఈ అవర్డు దక్కింది.