Published on Oct 23, 2025
Current Affairs
శ్రీశ్రీ రవిశంకర్‌
శ్రీశ్రీ రవిశంకర్‌

అంతర్జాతీయ సమాజానికి అందిస్తున్న సేవలను గుర్తిస్తూ అమెరికాలోని సియాటిల్‌ నగరం అక్టోబరు 19వ తేదీని ‘శ్రీశ్రీ రవిశంకర్‌ దినోత్సవం’గా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా మానసిక ఒత్తిడి.. హింస లేని సమాజాన్ని నిర్మించడం, వివిధ మతాల మధ్య సామరస్యాన్ని పెంపొందించడం, సమాజంలో విలువలు పెంచేందుకు ఆయన చేసిన కృషికిగాను ఈ గౌరవాన్ని ప్రకటిస్తున్నట్లు పేర్కొంది. రవిశంకర్‌ ‘ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌’ సంస్థ వ్యవస్థాపకులు.