శ్రీలంక పార్లమెంటు ఎన్నికల్లో అధ్యక్షుడు అనురకుమార దిస్సనాయకే సారథ్యంలోని నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్‌పీపీ) పార్టీ అఖండ విజయం సాధించింది.
225 సీట్లు ఉన్న పార్లమెంటులో 159 స్థానాల్లో ఎన్‌పీపీ విజయం సాధించిందని 2024, నవంబరు 15న ఎన్నికల కమిషన్ ప్రకటించింది.
ఈ ఎన్నికల్లో ఎన్‌పీపీ 68 లక్షలకుపైగా (61 శాతం) ఓట్లు సాధించింది. సాజిత్ ప్రేమదాస నేతృత్వంలోని సమజి జన బలవేగయ పార్టీ 40 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది.