Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Mar 10, 2026
Current Affairs
శ్రీలంక ప్రధాన కోచ్‌గా కిర్‌స్టన్‌
శ్రీలంక ప్రధాన కోచ్‌గా కిర్‌స్టన్‌

టీమ్‌ఇండియా మాజీ కోచ్‌ గారీ కిర్‌స్టన్‌ 2026, మార్చి 9న శ్రీలంక ప్రధాన కోచ్‌గా నియమితుడయ్యాడు. అతడు రెండేళ్లు పదవిలో ఉంటాడు. ఈయన దక్షిణాఫ్రికా మాజీ ఓపెనర్‌. 2008 నుంచి 2011 వరకు భారత జట్టు కోచ్‌గా పనిచేశాడు. అతడి మార్గనిర్దేశంలోనే భారత్‌.. 2011 ప్రపంచకప్‌ గెలిచింది. 58 ఏళ్ల కిర్‌స్టన్‌.. 2011 నుంచి 13 వరకు దక్షిణాఫ్రికా కోచ్‌గా పనిచేశాడు. ఇటీవల టీ20 ప్రపంచకప్‌లో నమీబియా జట్టుకు సలహాదారుగా వ్యవహరించాడు.