భారత సహకారంతో శ్రీలంకలో నిర్మించిన మొదటి బెయిలీ వంతెన (తాత్కాలిక వంతెన)ను 2026, జనవరి 11న ప్రారంభించారు. సెంట్రల్ ప్రావిన్స్-ఉవా ప్రావిన్స్ మధ్య రాకపోకలకు కీలకంగా ఉన్న రహదారి అనుసంధానం 2025, నవంబరులో వచ్చిన దిత్వా తుపానుతో ధ్వంసమైంది.
అనంతర కాలంలో శ్రీలంకలో పర్యటించిన భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ అక్కడ దెబ్బతిన్న రోడ్లు, రైల్వే లైన్ల పునరుద్ధరణకు ‘ఆపరేషన్ సాగర బంధు’ పేరుతో రూ.45 కోట్లు ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్లు ప్రకటించారు. దీని కింద భారత సైన్యం ఈ బెయిలీ వంతెనను నిర్మించింది.