దిత్వా తుపాను కారణంగా అతలాకుతలమైన శ్రీలంకకు భారత్ 45 కోట్ల డాలర్ల ఆర్థిక సాయం ప్రకటించింది. శ్రీలంక పునర్నిర్మాణానికి స్థిరమైన నిబద్ధతతో భారత్ ఉందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ తెలిపారు. భారత ప్రధానమంత్రి మోదీ తరఫున ప్రత్యేక రాయబారిగా ఆయన శ్రీలంకకు వెళ్లారు.
రోడ్లు, రైలుమార్గాల పునరుద్ధరణకు.. ధ్వంసమైన ఇళ్ల పునర్నిర్మాణానికి.. వ్యవసాయ, ఆరోగ్య, విద్యా వ్యవస్థల మద్దతుకు ఈ ఆర్థికసాయం ఉపయోగపడుతుందని తెలిపారు.