దేశవ్యాప్తంగా ఉన్న వివిధ జంతువుల సంఖ్య తెలుసుకునేందుకు 2025, మార్చి 15 నుంచి జంతుగణనను శ్రీలంక ప్రారంభించింది.
గ్రామాల పరిసరాల్లో సంచరించే కోతులు, నెమళ్లు, ఉడతలు, కొండముచ్చుల సంఖ్య గురించి ప్రజల నుంచి సిబ్బంది సమాచారాన్ని సేకరించారు.
ఈ సర్వే కోసం దాదాపు 40 వేల మందికిపైగా సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్లారు. జంతువుల వల్ల జరుగుతున్న పంటనష్టాన్ని శ్రీలంక ప్రభుత్వం తీవ్రంగా పరిగణించడం ఈ సర్వేకు కారణం.
శ్రీలంకలో 2022లో కేవలం జంతువుల వల్ల 6 నెలల వ్యవధిలో రూ.3 వేల కోట్ల విలువైన పంటనష్టం జరిగిందని అధికారవర్గాలు తెలిపాయి.