అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ భారత సంతతికి చెందిన శ్రీరామ్ కృష్ణన్‌ను తన సలహాదారుల బృందంలో ఒకరిగా నియమించుకున్నారు.
వ్యాపారవేత్త, అంకుర సంస్థల పెట్టుబడిదారు (వెంచర్ కేపిటలిస్ట్), రచయిత అయిన శ్రీరామ్ కృష్ణన్ ట్రంప్ బృందంలో కృత్రిమ మేధ (ఏఐ) రంగ సలహాదారుగా వ్యవహరిస్తారు.
వైట్‌హౌస్‌లో కృత్రిమ మేధ, క్రిప్టో సంబంధ వ్యవహారాలను చూసుకునే డేవిడ్ ఓ స్యాక్స్‌తో కలిసి కృష్ణన్ పనిచేస్తారు.
తమిళనాడు రాజధాని చెన్నైలో జన్మించిన శ్రీరామ్ కృష్ణన్ అన్నా యూనివర్సిటీలో ఇంజినీరింగ్ పూర్తిచేశారు.