విధి నిర్వహణలో అత్యుత్తమ ధైర్యసాహసాలను ప్రదర్శించిన 70 మంది త్రివిధ దళాల సిబ్బందికి శౌర్య పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రకటించారు. ఇందులో ఆరుగురిని మరణానంతరం ఎంపిక చేశారు. మొత్తం.. ఒక అశోక చక్ర, మూడు కీర్తి చక్రలు, 13 శౌర్య చక్రలు ప్రకటించారు.
వ్యోమగామి శుభాంశు శుక్లాను ప్రభుత్వం శాంతికాలంలో ఇచ్చే అత్యున్నత శౌర్య పురస్కారం ‘అశోక చక్ర’కు ఎంపిక చేసింది.
శాంతికాలంలో ఇచ్చే మూడో అత్యున్నత సాహస పురస్కారమైన శౌర్య చక్రకు ఎంపికైనవారిలో నౌకాదళానికి చెందిన మహిళా అధికారులు లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా, లెఫ్టినెంట్ కమాండర్ రూపా ఉన్నారు. వీరు తెరచాప నౌక ఐఎన్‌ఎస్‌వీ తరణిలో 8 నెలల పాటు ప్రపంచాన్ని చుట్టివచ్చారు.