సాయుధ దళాల్లో పనిచేస్తున్న 93 మందికి గణతంత్ర దినోత్సవం సందర్భంగా శౌర్య పురస్కారాల అందజేతకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 2025, జనవరి 25న ఆమోదముద్ర వేశారు.
ఇందులో ఇద్దరికి కీర్తిచక్ర, 14 మందికి శౌర్యచక్ర అవార్డులు ఉన్నాయి. దేశంలో రెండో అత్యున్నత శౌర్య పురస్కారమైన కీర్తిచక్రను మేజర్ మన్‌జీత్, నాయక్ దిలావర్ ఖాన్ (మరణానంతరం)లకు అందజేయనున్నారు.
శౌర్యచక్ర అవార్డులకు ఎంపికైన 14 మందిలో ముగ్గురికి మరణానంతరం ఈ గౌరవం దక్కనుంది. వీటితోపాటు రక్షణ సిబ్బందికి 305 గౌరవ మెడల్స్‌ను రాష్ట్రపతి ఆమోదించారు.