స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కొత్త ఛైర్మన్‌గా 2024, ఆగస్టు 28న చల్లా శ్రీనివాసులు శెట్టి బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఎస్‌బీఐ దేశంలోనే అతిపెద్ద బ్యాంక్‌గా ఉంది. దినేశ్ ఖరా స్థానంలో ఈయన బాధ్యతలు స్వీకరించారు.
* శెట్టి బ్యాంక్‌లో ఇప్పటిదాకా అత్యంత సీనియర్ ఎండీగా ఉన్నారు. ఎస్‌బీఐలోని సంప్రదాయం ప్రకారం, బ్యాంక్ ఎండీల నుంచే ఛైర్మన్ నియామకం జరుగుతోంది. సాధారణంగా సీనియర్ ఎండీకే ఆ అవకాశం దక్కుతుంటుంది.