ప్రతిష్ఠాత్మక శ్రీదాశరథి కృష్ణమాచార్య అవార్డును 2025 సంవత్సరానికి ప్రముఖ కవి, వ్యాసకర్త అన్నవరం దేవేందర్‌కు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
తెలంగాణ భాష, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం దాశరథి జయంతి సందర్భంగా ప్రభుత్వం ఈ సాహితీ పురస్కారాన్ని ప్రదానం చేస్తోంది.
రవీంద్రభారతిలో 2025, జులై 22న దేవేందర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి ఈ అవార్డును బహూకరించారు.
అవార్డుతోపాటు రూ.1,01,116 నగదు, జ్ఞాపిక, శాలువను అందించారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం(ఎస్)లో దశరథం, కేదారమ్మలకు అన్నవరం దేవేందర్ 1962 అక్టోబరు 17న జన్మించారు.