ప్రముఖ భారతీయ సినిమా దర్శకుడు శ్యామ్ బెనెగల్(90) 2024, డిసెంబరు 23న ముంబయిలో కన్నుమూశారు.
ఈయన 1934 డిసెంబరు 14న హైదరాబాద్‌లో జన్మించారు.
సికింద్రాబాద్ మహబూబ్ కళాశాల, నిజాం కళాశాల, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆయన విద్యాభ్యాసం సాగింది.
సినీ రంగానికి ఆయన చేసిన సేవలకుగాను భారత ప్రభుత్వం 1976లో పద్మశ్రీ, 1991లో పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించింది.
సినీ రంగంలో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం 2005లో ఆయన్ని వరించింది.
2013లో ఏఎన్నార్ జాతీయ పురస్కారంతో ఆయన్ని గౌరవించారు. బెనెగల్ రాజ్యసభ సభ్యుడిగానూ సేవలందించారు.