భారత క్రికెట్ టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఇంగ్లాండ్‌లో టెస్టుల్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి భారత, ఆసియా కెప్టెన్‌గా అతడు రికార్డు సృష్టించాడు.
2025, జులై 3న బర్మింగ్‌హామ్‌లో జరిగిన రెండో టెస్టు రెండో రోజు 269 పరుగులు (387 బంతుల్లో 30×4, 3×6) చేశాడు.
శ్రీలంక బ్యాటర్ దిల్షాన్ 2011లో లార్డ్స్‌లో సాధించిన 193 పరుగులే ఇప్పటివరకు ఇంగ్లాండ్‌లో ఓ ఆసియా కెప్టెన్ చేసిన అత్యధిక స్కోరు.
ద్విశతకం సాధించిన భారత కెప్టెన్‌గా అతడు పటౌడీ, సునీల్ గావస్కర్, సచిన్ తెందుల్కర్, ధోని, కోహ్లిల సరసన నిలిచాడు.
కోహ్లి కెప్టెన్‌గా రికార్డు స్థాయిలో ఏడు డబుల్ సెంచరీలు సాధించాడు.