శాఫ్ అండర్-19 ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ టైటిల్ నిలబెట్టుకుంది. 2025, మే 18న యుపియాలో జరిగిన ఫైనల్లో 1-1 (4-3)తో పెనాల్టీ షూటౌట్లో బంగ్లాదేశ్‌ను ఓడించింది. నిర్ణీత సమయానికి భారత్-బంగ్లా 1-1తో నిలిచాయి. భారత్ తరఫున సింగమయుం షామి (2వ నిమిషం).. బంగ్లా జట్టులో జోయ్ అహ్మద్ (61వ) గోల్స్ సాధించారు. పెనాల్టీ షూటౌట్లో తొలి మూడు ప్రయత్నాల్లో బంగ్లా సఫలం కాగా భారత్ రెండే గోల్స్ చేసింది. కానీ తర్వాతి రెండు ప్రయత్నాల్లోనూ బంగ్లా విఫలమైతే.. భారత్ వరుసగా రెండు గోల్స్ కొట్టి విజేతగా నిలిచింది.