Published on Sep 5, 2025
Current Affairs
శాంపిల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టమ్‌ నివేదిక
శాంపిల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టమ్‌ నివేదిక

ప్రజారోగ్య సూచీల్లో కీలకమైనదిగా భావించే శిశు మరణాల రేటు(ఐఎంఆర్‌) తగ్గుదలలో మన దేశం గణనీయమైన పురోగతి సాధించింది.

రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా 2023 ఏడాదికి గాను విడుదల చేసిన శాంపిల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టమ్‌ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది.

2013లో ప్రతి వెయ్యి మంది శిశువుల్లో 40 మంది అకాల మృత్యువాత పడగా పదేళ్ల తర్వాత 2023లో అటువంటి వారి సంఖ్య 25కు తగ్గింది.

అంటే దశాబ్దకాలంలో శిశు మరణాల రేటులో 37.5 శాతం మేర తగ్గుదల నమోదైంది.  

1971లో ఐఎంఆర్‌ 129 కాగా...2023 గణాంకాలను దానితో పోల్చితే శిశు మరణాల రేటు 80శాతం మేర తగ్గింది.

ఇప్పటికీ మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తర్‌ప్రదేశ్‌లలో దేశంలోనే అత్యధికంగా శిశు మరణాలు నమోదవుతున్నాయి.

ఈ రాష్ట్రాల్లో అత్యధికంగా ఐఎంఆర్‌ ‘37’ కాగా మణిపుర్‌లో అత్యల్పంగా ‘3’ పాయింట్లుగా రికార్డయ్యింది.

కేరళలో ఒకే అంకె (5) ఐఎంఆర్‌ నమోదైంది. తెలంగాణలో ఇది 18గా, ఆంధ్రప్రదేశ్‌లో 19గా తేలింది.