అణు రంగంలో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించేందుకు వీలుగా తీసుకొచ్చిన సస్టెయినబుల్ హార్నెస్సింగ్ అండ్ అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా (శాంతి) బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించింది. ఇటీవల పార్లమెంటులో నెగ్గిన ఈ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారని 2025, డిసెంబరు 21న ప్రభుత్వ నోటిఫికేషన్ వెల్లడించింది.
పౌర అణు రంగానికి సంబంధించిన అన్ని చట్టాలను ఇది డీల్ చేయడంతోపాటు ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించనుంది. కొత్త చట్టం రాకతో ద ఆటమిక్ ఎనర్జీ చట్టం-1962, సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజీ చట్టం-2010 రద్దవుతాయి.