Published on Nov 11, 2025
Current Affairs
శాంతి - అభివృద్ధి కోసం ప్రపంచ సైన్స్‌ దినోత్సవం
శాంతి - అభివృద్ధి కోసం ప్రపంచ సైన్స్‌ దినోత్సవం

సమాజాభివృద్ధిలో సైన్స్‌ పాత్రను గుర్తించడంతోపాటు దాని వల్ల కలిగే దుష్ప్రభావాలపైనా ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా నవంబరు 10న ‘శాంతి - అభివృద్ధి కోసం ప్రపంచ సైన్స్‌ దినోత్సవం’గా (World Science Day For Peace And Development) నిర్వహిస్తారు. విజ్ఞానశాస్త్రంలో ఎప్పటికప్పుడు జరుగుతున్న పరిణామాలను తెలియజేయడం; శాంతిని పెంపొందించడంలో, స్థిరమైన సమాజాలను నిర్మించడంలో సైన్స్‌ పాత్రను చాటిచెప్పడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

చారిత్రక నేపథ్యం

విజ్ఞానశాస్త్రం గురించి ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు దేశాలు, ప్రాంతాల మధ్య తలెత్తుతున్న సంఘర్షణలను రూపుమాపి, శాంతిని నెలకొల్పేలా శాస్త్రవేత్తల మధ్య సహకారాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఏటా నవంబరు 10న ‘శాంతి - అభివృద్ధి కోసం ప్రపంచ సైన్స్‌ దినోత్సవం’గా జరుపుకోవాలని యునెస్కో జనరల్‌ అసెంబ్లీ 2001లో తీర్మానించింది.  

2002 నుంచి ప్రతి సంవత్సరం దీన్ని నిర్వహిస్తున్నారు.

2025 నినాదం: 'Trust, Transformation, and Tomorrow: The Science We Need for 2050'