పారిస్ పారాలింపిక్స్ కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్‌లో శీతల్ దేవి, రాకేశ్ కుమార్ జోడీ కాంస్యం సొంతం చేసుకుంది. కంచు పతక పోరులో టాప్‌సీడ్ శీతల్- రాకేశ్ 156-155 తేడాతో ఎలోనోరా- మాటియో (ఇటలీ)పై విజయం సాధించారు.
* శీతల్ 2023 ప్రపంచ పారా ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో రజతం గెలిచింది. ఈ పోటీల్లో పతకం గెలిచిన చేతుల్లేని మొదటి అమ్మాయి శీతల్. ఆసియా పారా క్రీడల్లో రెండు స్వర్ణాలు, ఓ రజతం నెగ్గింది.
* రాకేశ్ కుమార్ 2023 ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో మిక్స్‌డ్ స్వర్ణం గెలిచాడు. ఆసియా పారా క్రీడల్లో ఓ స్వర్ణం, రెండు రజతాలు దక్కించుకున్నాడు.