Published on Apr 7, 2025
Current Affairs
శాండ్‌ మాస్టర్‌ పురస్కారం
శాండ్‌ మాస్టర్‌ పురస్కారం

ఒడిశాలోని పూరీకి చెందిన ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌కు ప్రతిష్ఠాత్మక ‘ది ఫ్రెడ్‌ డారింగ్టన్‌ బ్రిటిష్‌ శాండ్‌ ఆర్ట్‌ మాస్టర్‌ అవార్డ్‌ -2025’ దక్కింది.

తద్వారా ఈ పురస్కారాన్ని పొందిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించారు.

ఇంగ్లండ్‌లోని వేమత్‌ నగరంలో జరిగిన అంతర్జాతీయ సైకత శిల్ప పోటీల్లో పాల్గొన్న సుదర్శన్‌.. ప్రపంచశాంతి సందేశంతో 10 అడుగుల ఎత్తయిన వినాయకుని విగ్రహాన్ని తీర్చిదిద్దారు.