Published on Dec 26, 2024
Current Affairs
వాసుదేవన్‌ నాయర్‌ కన్నుమూత
వాసుదేవన్‌ నాయర్‌ కన్నుమూత

ప్రముఖ మలయాళ రచయిత, జ్ఞానపీఠ్‌ పురస్కార గ్రహీత ఎం.టి.వాసుదేవన్‌ నాయర్‌ (91) 2024, డిసెంబరు 25న కోజికోడ్‌లో మరణించారు.

ఎంటీగా సుపరిచితుడైన ఆయన తొమ్మిది నవలలు, 19 కథా సంపుటాలు వెలువరించారు.

అనేక వ్యాసాలు, జీవిత చరిత్రలు రాశారు. ఆరు చిత్రాలకు దర్శకత్వం వహించారు.

54 స్క్రీన్‌ప్లేలు రచించారు. ‘మాతృభూమి’ వారపత్రికకు సంపాదకునిగా అనేక ఏళ్లపాటు ఉన్నారు.

2005లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్‌ పురస్కారంతో గౌరవించింది.