Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Feb 21, 2026
Apprenticeship
వెస్ట్రన్‌ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు
వెస్ట్రన్‌ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు

ముంబయి ప్రధాన కేంద్రంగా గల రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్(ఆర్‌ఆర్‌సీ)- వెస్ట్రన్‌ రైల్వే 2025-26 సంవత్సరానికి వెస్ట్రన్‌ రైల్వే పరిధిలోని డివిజన్‌/ వర్క్‌షాప్‌లలో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

అప్రెంటిస్: 5,349 పోస్టులు

వివరాలు:

ట్రేడ్‌ల వారీగా ఖాళీలు: 

ఫిట్టర్- 1614

ఎలక్ట్రీషియన్- 1217

వెల్డర్- 532

పీఏఎస్‌ఏఏ- 280

ఎలక్ట్రానిక్ మెకానిక్- 236

మెకానిక్ (డీజిల్)- 207

పెయింటర్- 190

కార్పెంటర్- 184

రిఫ్రిజిరేటర్ (AC-మెకానిక్)- 184

పైప్ ఫిట్టర్- 176

ప్లంబర్- 136

వైర్‌మ్యాన్- 126

డ్రాఫ్ట్స్‌మ్యాన్ (సివిల్)- 87

టర్నర్- 75

స్టెనోగ్రాఫర్- 40

మెషినిస్ట్ (గ్రైండర్)- 25

ఫోర్జర్ & హీట్ ట్రీటర్- 16

మెషినిస్ట్- 14

మెకానిక్ మోటార్ వెహికల్- 10

అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 23-03-2026 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

శిక్షణ కాలం: ఒక సంవత్సరం. 

ఎంపిక ప్రక్రియ: పదో తరగతి, ఐటీఐ మార్కుల మెరిట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు. 

దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. 

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: 21/02/2026.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 23/03/2026.

Website:https://www.rrc-wr.com/