Published on Sep 21, 2024
Apprenticeship
వెస్ట్రన్‌ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు
వెస్ట్రన్‌ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు

రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సీ)- వెస్ట్రన్‌ రైల్వే 2024-25 సంవత్సరానికి వెస్ట్రన్‌ రైల్వే పరిధిలోని డివిజన్‌/ వర్క్‌షాప్‌లలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 
 
మొత్తం ఖాళీలు: 5,066

వివరాలు:

డివిజన్‌/ వర్క్‌షాప్‌లు: బీసీటీ డివిజన్, బీఆర్‌సీ డివిజన్, ఏడీఐ డివిజన్, ఆర్‌టీఎం డివిజన్, ఆర్‌జేటీ డివిజన్, బీవీపీ డివిజన్, పీఎల్‌ వర్క్‌షాప్, ఎంఎక్స్‌ వర్క్‌షాప్, బీవీపీ వర్క్‌షాప్, డీహెచ్‌డీ వర్క్‌షాప్, పీఆర్‌టీఎన్‌ వర్క్‌షాప్, ఎస్‌బీఐ ఇంజినీరింగ్‌ వర్క్‌షాప్, ఎస్‌బీఐ సిగ్నల్ వర్క్‌షాప్, హెడ్ క్వార్టర్ ఆఫీస్.

ట్రేడ్: ఫిట్టర్, వెల్డర్, టర్నర్, మెషినిస్ట్, కార్పెంటర్, పెయింటర్, మెకానిక్, పీఎస్‌ఏఏ, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, వైర్‌మ్యాన్, మెకానిక్ రిఫ్రిజిరేషన్ అండ్‌ ఏసీ, పైప్ ఫిట్టర్, ప్లంబర్, డ్రాఫ్ట్స్‌మ్యాన్, స్టెనోగ్రాఫర్, ఫోర్జర్ అండ్‌ హీట్ ట్రీటర్.

అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 22-10-2024 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

శిక్షణ కాలం: ఒక సంవత్సరం. 

ఎంపిక ప్రక్రియ: పదో తరగతి, ఐటీఐ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష/ వైవా ఉండదు. 

దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. 

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: 23/09/2024.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 22/10/2024.

Website:https://www.rrc-wr.com/?AspxAutoDetectCookieSupport=1