ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ శైలజ విశిష్ట శాస్త్రవేత్తగా నియమితులయ్యారు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్‌ఐఆర్) 80 ఏళ్ల చరిత్రలో ఒక మహిళ ఈ హోదా పొందడం ఇదే మొదటిసారి. సాధారణంగా పదవీ విరమణ చేసిన అత్యంత నిపుణుల సేవలను వినియోగించుకునేందుకు విశిష్ట శాస్త్రవేత్త పదవి ఇస్తుంటారు. ఐదేళ్ల సర్వీసు లేదా 70ఏళ్ల వయస్సు.. వీటిలో ఏది ముందైతే అంతవరకు డాక్టర్ శైలజ పదవిలో ఉంటారు.