Published on Feb 22, 2025
Current Affairs
విశ్వ రాజ్‌కుమార్‌
విశ్వ రాజ్‌కుమార్‌

భారత విద్యార్థి విశ్వ రాజ్‌కుమార్‌ (20) ప్రపంచ మెమరీ లీగ్‌ ఛాంపియన్‌షిప్‌-2025 పోటీల్లో  విజేతగా నిలిచాడు.

80 ర్యాండమ్‌ నంబర్లను 13.50 సెకన్లలో,  30 చిత్రాలను 8.40 సెకన్లలో తప్పుల్లేకుండా వరుస క్రమంలో గుర్తించి ఈ ఘనత సాధించాడు.

ఆన్‌లైన్‌లో నిర్వహించే ఈ కార్యక్రమంలో 5 వేల పాయింట్లతో రాజ్‌కుమార్‌ మొదటిస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. 

రాజ్‌కుమార్‌ పుదుచ్చేరిలోని మనకులా వినాయగర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో చదువుతున్నాడు.