విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పునరుజ్జీవింపజేయడానికి కేంద్ర ప్రభుత్వం రూ.11,500 కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది.
ఈ ప్యాకేజీ వివరాలను కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి 2025 జనవరి 17న దిల్లీలో వెల్లడించారు.
విశాఖ ఉక్కు అనేది 100% కేంద్ర ప్రభుత్వ వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. 73 లక్షల టన్నుల ద్రవ ఉక్కు తయారీ సామర్థ్యంతో ఉన్న ఈ సంస్థకు రూ.7,686.24 కోట్ల ఆస్తులు, రూ.26,114.92 కోట్ల అప్పులున్నాయి.
2023-24లో రూ.4,848.86 కోట్లు, 2022-23లో రూ.2,858.74 కోట్ల నష్టాన్ని మూటగట్టుకొంది. వర్కింగ్ క్యాపిటల్ కోసం చేసిన అప్పులు పెరగడం దీనికి ప్రధాన కారణం.