కేంద్ర ప్రభుత్వం విశాఖలో బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తోంది. విశాఖలో పోర్టులు, విమానాశ్రయం ఉండటంతో దేశవిదేశాల నుంచి ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఎగుమతులు, దిగుమతులు గతంలో కన్నా బాగా పెరిగాయి. భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఇవి మరింత ఊపందుకోనున్నాయి.
ఈ నేపథ్యంలో పూర్తిస్థాయిలో ఇమిగ్రేషన్ సేవలకు ప్రత్యేక కార్యాలయం అవసరం కానుంది. దీంతో కేంద్ర హోంశాఖ విశాఖ నగరం మారికవలస సమీపంలోని వీఎంఆర్‌డీఏకు చెందిన ఓజోన్ వ్యాలీ లేఅవుట్‌లో కార్యాలయం ఏర్పాటుకు చర్యలు తీసుకుంది.