Published on Mar 5, 2025
Current Affairs
విశాఖలో దివ్యాంగుల క్రీడా కేంద్రం
విశాఖలో దివ్యాంగుల క్రీడా కేంద్రం

ఆంధ్రప్రదేశ్‌లో దివ్యాంగుల జాతీయ క్రీడా కేందాన్ని (స్పోర్ట్స్‌ సెంటర్‌) విశాఖలో ఏర్పాటు చేసేందుకు కేంద్రం సమ్మతించింది.

దేశంలోనే రెండోదైన దక్షిణ భారతదేశానికి సంబంధించిన ఈ కేంద్రం ఏపీలో ఏర్పాటు కానుంది. సుమారు రూ.200 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో దీన్ని నిర్మించనున్నారు.

నిర్వహణ ఖర్చూ కేంద్రమే భరిస్తుంది. దీంతోపాటు కృత్రిమ అవయవాలు తయారు చేసే అలిమ్‌కో కేంద్రాన్నీ విశాఖలో ఏర్పాటుకు అంగీకరించింది.

స్పోర్ట్స్‌ సెంటర్‌ కోసం ఏపీ ప్రభుత్వం విశాఖ నగరం కొమ్మాదిలో 22 ఎకరాలను కేటాయించింది.