Published on Jul 4, 2025
Government Jobs
విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంకులో క్లరికల్‌ ట్రైనీ పోస్టులు
విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంకులో క్లరికల్‌ ట్రైనీ పోస్టులు

విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్- డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన హైదరాబాద్‌, పాత జిల్లాలైన నెల్లూరు, రాయలసీమ, గుంటూరు, పశ్చిమ గోదావరి, కృష్ణ, ప్రకాశం వీసీబీఎల్‌ శాఖల్లో క్లరికల్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

వివరాలు:

క్లరికల్‌ ట్రైనీ: 45 పోస్టులు

అర్హత: డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఇంగ్లిష్, తెలుగు తప్పనిసరి, ఎంఎస్‌ ఆఫీస్‌ (ఎంఎస్‌ వర్డ్‌ అండ్‌ ఎక్సెల్‌) పరిజ్ఞానం కలిగి ఉండాలి.

వయోపరిమితి: 01.06.2025 నాటికి 30 ఏళ్లు మించకూడదు.

పే స్కేల్: ట్రైనీ సమయంలో నెలకు రూ.15,000+ అలవెన్సెస్‌. 

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్షలు, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.

జాబ్‌ లొకేషన్‌: హైదరాబాద్‌, గుంటూరు, నెల్లూరు, రాయలసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణ, ప్రకాశం.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 10.07.2025.

ఆఫ్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 16.07.2025.

చిరునామా: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను విశాఖపట్నం కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌- హెచ్‌ఆర్‌ డిపార్ట్‌మెంట్‌ సెంట్రల్‌ ఆఫీస్‌, డోర్‌నెం.47-3-27/3/4, ఐదో వీధి, ద్వారకానగర్‌, విశాఖపట్నం చిరునామాకు పంపించాలి.

Website:https://www.vcbl.in/