ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2025, మే 1న ముంబయిలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటరులో ‘వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్’ (వేవ్స్ 2025) ప్రారంభించారు. ఈ సదన్సు దేశంలో జరగడం ఇదే మొదటిసారి. భారత్‌లో ‘ఆరెంజ్ ఎకానమీ’ (సృజనాత్మక ఆర్థికవ్యవస్థ) పరిఢవిల్లుతోందని మోదీ తెలిపారు. ప్రపంచం కొత్తదనం కోరుకొంటున్న ఈ తరుణంలో ‘‘భారత్‌లో సృష్టిద్దాం, జగతికి అందిద్దాం’’ నినాదంతో మనం ముందడుగు వేయడానికి ఇదే సరైన తరుణమని చెప్పారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ సదస్సు మే 4న ముగుస్తుంది.