‘వివిధతా కా అమృత్ మహోత్సవ్’ రెండో ఎడిషన్‌ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 2025, మార్చి 5న ప్రారంభించారు.
ఈ కార్యక్రమం దక్షిణ భారత దేశానికి చెందిన కళలు, సంస్కృతిని ప్రజలు అవగాహన చేసుకునేందుకు దోహదపడనుంది.
ఈ ఉత్సవాన్ని దేశ సుసంపన్న వైవిధ్యాన్ని ప్రదర్శించేందుకు, వేడుక చేసుకునేందుకు రాష్ట్రపతి భవన్‌లోని నిర్వహిస్తున్నారు. రెండోసారి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఈసారి దక్షిణ భారత రాష్ట్రాలపై దృష్టి సారించారు.
‘వివిధతా కా అమృత్ మహోత్సవ్’ రెండవ దశ కార్యక్రమంతో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ సహా కేంద్ర పాలిత ప్రాంతాలైన లక్షద్వీప్, పుదుచ్చేరిల చైతన్యవంతమైన సంస్కృతిని ప్రజలు అవగాహన చేసుకోవచ్చని రాష్ట్రపతి వ్యాఖ్యానించారు.