‘వలసలు, వీసా, విదేశీయుల నమోదు-ట్రాకింగ్’ (ఐవీఎఫ్‌ఆర్‌టీ) పథకాన్ని మరో అయిదేళ్లు పొడిగించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఇమ్మిగ్రేషన్, వీసాల జారీ తదితర అంశాలన్నింటినీ అనుసంధానించే ఈ పథకాన్ని 1.4.2026 నుంచి 31.3.2031 వరకు కొనసాగించడానికి రూ.1,800 కోట్లు కేటాయించాలని ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన 2026, మార్చి 25న జరిగిన క్యాబినెట్ సమావేశం నిర్ణయం తీసుకుందని ప్రభుత్వం తెలిపింది.
2010లో తొలిసారి ఆమోదం పొందిన పథకాన్ని 2015, 2017, 2021లలో పొడిగించారు.