Published on Jun 16, 2025
Current Affairs
వాల్ట్‌లో ప్రణతికి కాంస్యం
వాల్ట్‌లో ప్రణతికి కాంస్యం

ఆసియా జిమ్నాస్టిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో ప్రణతి నాయక్‌ కాంస్యం నెగ్గింది.

2025, జూన్‌ 14న దక్షిణ కొరియాలోని జిచియాన్‌లో జరిగిన టోర్నీలో వాల్ట్‌లో ఆమె 13.466 స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచింది.

యిహాన్‌ జాంగ్‌ (13.650) స్వర్ణం.. థికున్‌ హు (వియత్నాం, 13.583) రజతం గెలుచుకున్నారు.

ప్రణతికి ఇది మూడో ఆసియా ఛాంపియన్‌షిప్‌ పతకం.