Published on Sep 26, 2024
Current Affairs
వరిలో తెలంగాణ టాప్‌
వరిలో తెలంగాణ టాప్‌

2023-24లో దేశంలో ప్రధాన పంటల దిగుబడుల తుది అంచనాలను కేంద్ర వ్యవసాయ శాఖ 2024, సెప్టెంబరు 25న విడుదల చేసింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా ఈ అంచనాలను రూపొందించింది.

2023-24లో వరి దిగుబడిలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. అలాగే పత్తిలో 3, పొద్దుతిరుగుడులో 4, మొక్కజొన్న, చిరుధాన్యాల్లో 5వ స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌ పొగాకులో 2, మినుము, ఆముదంలో 3, జొన్న, వేరుసెనగ దిగుబడుల్లో 5 స్థానాలను సాధించింది.  

రిమోట్‌ సెన్సింగ్, ప్రతి వారం రూపొందించే క్రాప్‌ వెదర్‌వాచ్‌ గ్రూప్, ఇతర ఏజెన్సీల నుంచి వచ్చిన సమాచారాన్ని సరిపోల్చుకొని తుది అంచనాలను విడుదల చేసింది.