Published on May 29, 2025
Current Affairs
వరల్డ్‌ హంగర్‌ డే
వరల్డ్‌ హంగర్‌ డే

ప్రపంచవ్యాప్తంగా ఆకలి సమస్యను అంతం చేసే లక్ష్యంతో ఏటా మే 28న వరల్డ్‌ హంగర్‌ డే నిర్వహిస్తారు.

సరిపడినంత కేలరీల ఆహారం లేకపోవడాన్ని ఆకలి అంటారు.

ప్రపంచవ్యాప్తంగా నేటికీ అనేక మంది ప్రజలు ఈ సమస్యతో బాధపడుతున్నారు.

యునైటెడ్‌ నేషన్స్‌ (యూఎన్‌) 2015-30 కాలానికి రూపొందించిన 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో రెండోది ‘జీరో హంగర్‌’.

అంటే ఆకలిని అంతమొందించడం, ఆహార భద్రతను సాధించడం, పోషకత్వ అభివృద్ధి, సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించడం.

వీటన్నింటిపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

చారిత్రక నేపథ్యం:

25 ఏళ్లలో ఆకలి లేని ప్రపంచాన్ని సాధించాలనే లక్ష్యంతో 1977లో న్యూయార్క్‌ కేంద్రంగా ‘ది హంగర్‌ ప్రాజెక్ట్‌’ అనే సంస్థ ఏర్పడింది.

ఆకలి సమస్యకు మూల కారణాలను కనుక్కోవడం, ఆహర భద్రతను ప్రోత్సహించడంపై ఇది పని చేస్తోంది.

ఆకలికి వ్యతిరేకంగా ఈ సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో ప్రజలందరినీ భాగస్వాములను చేయడంతో పాటు దీని గురించి తెలిపేలా ఒక రోజును ఏర్పాటు చేయాలని భావించింది.

దీని ప్రకారం, ఏటా మే 28న వరల్డ్‌ హంగర్‌ డేగా జరుపుకోవాలని ది హంగర్‌ ప్రాజెక్ట్‌ 2011లో తీర్మానించింది.

2025 నినాదం: Sowing Resilience