Published on Nov 10, 2025
Current Affairs
వరల్డ్‌ రేడియాలజీ డే
వరల్డ్‌ రేడియాలజీ డే

జర్మనీకి చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త విలియం రాంట్‌జెన్‌ ఎక్స్‌-కిరణాలను కనుక్కున్నారు. ఆధునిక భౌతికశాస్త్ర అభివృద్ధికి కృషి చేసిన ముఖ్యమైన వ్యక్తుల్లో రాంట్‌జెన్‌ ఒకరు. ఎక్స్‌-కిరణాలను వైద్యరంగంలో రేడియోగ్రఫీ, రేడియోథెరపీకి ఉపయోగిస్తారు. భత్రతా చర్యల్లో భాగంగా లగేజ్‌ను స్కాన్‌ చేయడంలోనూ ఈ కిరణాలను వినియోగిస్తారు.

1895, నవంబరు 8న ఎక్స్‌ - కిరణాలను కనుక్కున్న విలియం రాంట్‌జెన్‌ గౌరవార్థం ఏటా ఆ తేదీన  ప్రపంచవ్యాప్తంగా ‘వరల్డ్‌ రేడియాలజీ డే’గా నిర్వహిస్తారు. ఈ కిరణాల ద్వారా శస్త్ర చికిత్స చేయకుండానే వైద్యులు మానవ శరీరంలోపలి కణజాలాలు, ఎములను చూడొచ్చు. వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు కారణమైన వీటి గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

యూరోపియన్‌ సొసైటీ ఆఫ్‌ రేడియాలజీ (ఈఎస్‌ఆర్‌), రేడియోలాజికల్‌ సొసైటీ ఆఫ్‌ నార్త్‌ అమెరికా (ఆర్‌ఎస్‌ఎన్‌ఏ), అమెరికన్‌ కాలేజ్‌ ఆఫ్‌ రేడియాలజీ (ఏసీఆర్‌) సంయుక్తంగా ఈ దినోత్సవాన్ని మొదటిసారి 2012లో నిర్వహించాయి. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం దీన్ని జరుపుతున్నారు.