గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో రెండు చేతులూ కోల్పోయిన ఈ పాలస్తీనా బాలుడు మహమ్మద్ అజ్జౌర్ (9) చిత్రం వరల్డ్ ప్రెస్ ఫొటో ఆఫ్ ది ఇయర్ 2025గా 2025, ఏప్రిల్ 17న ఎంపికైంది. ఖతర్ కేంద్రంగా పనిచేస్తున్న పాలస్తీనియన్ మహిళా ఫొటోగ్రాఫరు సమర్ అబు ఎలౌఫ్ ‘ది న్యూయార్క్ టైమ్స్’ కోసం ఈ ఫొటో తీశారు. 68వ వేడుకగా జరిగిన ఈ ప్రతిష్ఠాత్మక ఫొటో జర్నలిజం పోటీల్లో 141 దేశాలకు చెందిన 3,778 మంది ఫొటోగ్రాఫర్లు మొత్తం 59,320 ఎంట్రీలను సమర్పించారు.