Published on May 26, 2025
Current Affairs
వరల్డ్‌ థైరాయిడ్‌ డే
వరల్డ్‌ థైరాయిడ్‌ డే

థైరాయిడ్‌ వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా మే 25న ప్రపంచ థైరాయిడ్‌ అవగాహన దినోత్సవంగా నిర్వహిస్తారు.

దీన్నే ‘వరల్డ్‌ థైరాయిడ్‌ డే’ అని కూడా అంటారు. మహిళలకు వచ్చే ప్రధాన ఆరోగ్య సమస్యల్లో థైరాయిడ్‌ ఒకటి.

ఇది నెలసరి సమస్యలు, బరువు పెరగడం, అలసటతోపాటు ఇతర రుగ్మతలకు కారణమవుతుంది.

థైరాయిడ్‌ సంబంధ సమస్యలు, లక్షణాలు, నివారణ మొదలైనవాటి గురించి ప్రజలను చైతన్యపరచడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

చారిత్రక నేపథ్యం: 

థైరాయిడ్‌ వ్యాధి గురించి అధ్యయనం చేసే లక్ష్యంతో 1965, మే 25న యూరోపియన్‌ థైరాయిడ్‌ అసోసియేషన్‌ (ఈటీఏ) ఏర్పడింది. వ్యాధి కారక అంశాలు, నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ సంస్థ అనేక పరిశోధనలు చేస్తోంది.

2007, సెప్టెంబరులో జరిగిన థైరాయిడ్‌ ఫెడరేషన్‌ వార్షిక సర్వసభ్య సమావేశంలో థైరాయిడ్‌ నియంత్రణకు ఈటీఏ చేస్తోన్న కృషికి గుర్తుగా ఏటా మే 25న ‘వరల్డ్‌ థైరాయిడ్‌ డే’గా జరుపుకోవాలని సభ్యులంతా తీర్మానించారు. 2008 నుంచి దీన్ని ఏటా నిర్వహిస్తున్నారు.

2025 నినాదం: "Non-Communicable Diseases (NCDs)".