Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Mar 25, 2026
Current Affairs
వరల్డ్‌ ట్యూబర్‌క్యులోసిస్‌ డే
వరల్డ్‌ ట్యూబర్‌క్యులోసిస్‌ డే

మానవులకు సోకే అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధుల్లో క్షయ ఒకటి. ఇది బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్‌ వల్ల కలుగుతుంది. ఇది ప్రధానంగా ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తుంది. భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఇది ప్రమాదకర ఆరోగ్య సమస్యగా పరిణమించింది. క్షయ వ్యాధి వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక, ఆర్థిక సమస్యల గురించి ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా ఏటా మార్చి 24న ‘వరల్డ్‌ ట్యూబర్‌క్యులోసిస్‌ డే’గా నిర్వహిస్తారు. ఈ మహమ్మారిని శాశ్వతంగా నిర్మూలించడానికి చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి చెప్పడం, ప్రయత్నాలు ముమ్మరం చేయడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

చారిత్రక నేపథ్యం:

జర్మనీకి చెందిన డాక్టర్‌ రాబర్ట్‌ కోచ్‌ అనే వైద్యుడు 1882, మార్చి 24న మొదటిసారి క్షయ వ్యాధి కారకమైన మైకోబ్యాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్‌ను గుర్తించారు. ఇది రోగ నిర్ధా రణ, చికిత్సకు పునాదిగా నిలిచింది. ఇది జరిగిన వందేళ్లకు 1982లో డబ్ల్యూహెచ్‌ఓ, IUATLD సంయుక్తంగా ఆ తేదీని ‘వరల్డ్‌ ట్యూబర్‌క్యులోసిస్‌ డే’గా గుర్తించాయి. 

2026 నినాదం:  ‘Yes! We can end TB!’