Published on May 3, 2025
Current Affairs
వరల్డ్‌ ట్యూనా డే
వరల్డ్‌ ట్యూనా డే

‘వరల్డ్‌ ట్యూనా డే’ను ప్రపంచవ్యాప్తంగా ఏటా మే 2న నిర్వహిస్తారు. ట్యూనా అనేది ఒక రకమైన సముద్ర చేప జాతి. దీన్ని ఆహారంగా తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు వాటి సంరక్షణ గురించి చైతన్యపరచడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. 

ట్యూనా చేపలు గంటకు 43 మైళ్ల వేగంతో ఈదగలవు. వీటిలో ఒమేగా-3, విటమిన్‌ బి-12, ఇతర ఖనిజాలు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ట్యూనాలో మొత్తం 15 రకాలు ఉన్నాయని అంచనా. సెంట్రల్‌ మెరైన్‌ ఫిషరీస్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీఎంఎఫ్‌ఆర్‌ఐ) ప్రకారం, భారత సముద్ర జలాల్లో కేరా, కవాకవా, ఫ్రిగేట్‌ ట్యూనా, డాగ్‌టూత్‌ ట్యూనా, బుల్లెట్‌ ట్యూనా, ఓరియంటల్‌ బోనిటో, స్కిప్‌జాక్, అల్బాకోర్, ఎల్లోఫిన్‌ ట్యూనా అనే తొమ్మిది రకాలు ట్యూనాలు నివసిస్తున్నాయి.
చారిత్రక నేపథ్యం:
ప్రపంచవ్యాప్తంగా ట్యూనా చేపలకు ఉన్న డిమాండ్‌ దృష్ట్యా వాటిని అతిగా వేటాడేవారు. దీంతో సముద్ర జాలాల్లో వాటి సంఖ్య క్రమేణా తగ్గుతూ వచ్చింది. ట్యూనా సంరక్షణ, స్థిరమైన వేట పద్ధతులను ప్రోత్సహించే లక్ష్యంతో ఐక్యరాజ్యసమితి 2016, డిసెంబరులో మే 2న ‘వరల్డ్‌ ట్యూనా డే’గా నిర్వహించాలని తీర్మానించింది. 2017 నుంచి దీన్ని ఏటా నిర్వహిస్తున్నారు.