ప్రపంచ ఉత్తమ నగరాలకు సంబంధించి 2024, నవంబరు 20న విడుదలైన ‘వరల్డ్స్ బెస్ట్ సిటీస్ 2025’ ర్యాంకుల జాబితాలో లండన్ వరుసగా పదో ఏడాది అగ్రస్థానంలో నిలిచింది.
ఆ తర్వాతి స్థానాల్లో న్యూయార్క్ (అమెరికా), పారిస్ (ఫ్రాన్స్), టోక్యో (జపాన్), సింగపూర్, రోమ్ (ఇటలీ), మాడ్రిడ్ (స్పెయిన్), బార్సిలోనా (స్పెయిన్), బెర్లిన్ (జర్మనీ), సిడ్నీ (ఆస్ట్రేలియా) ఉన్నాయి. భారతీయ నగరాలు ఏవీ ఇందులో లేవు.
ఇప్‌సాస్ సంస్థ భాగస్వామ్యంతో రెసొనెన్స్ కన్సల్టెన్సీ రూపొందించిన వార్షిక ర్యాంకింగుల విశ్లేషణ నివేదికను లండన్‌లో విడుదల చేశారు.
శ్రామికశక్తి, సందర్శకులు, వ్యాపారాలను ఆకర్షించడం లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ప్రపంచవ్యాప్తంగా ఆయా నగరాలను విశ్లేషిస్తారు.