Published on Mar 5, 2025
Current Affairs
విరాట్‌ కోహ్లి
విరాట్‌ కోహ్లి

భారత్‌ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఫీల్డర్‌గా విరాట్‌ కోహ్లి రికార్డు సృష్టించాడు.

టెస్టులు, వన్డేలు, టీ20ల్లో కలిపి అతడి క్యాచ్‌ల సంఖ్య 336కు చేరుకుంది. రాహుల్‌ ద్రవిడ్‌ (334)ను అతడు అధిగమించాడు.

ఈ క్రమంలోనే వన్డేల్లో అత్యధిక క్యాచ్‌ల జాబితాలో పాంటింగ్‌ (160)ను వెనక్కి నెట్టి కోహ్లి (161) రెండో స్థానానికి చేరుకున్నాడు. జయవర్దనే (218) అగ్రస్థానంలో ఉన్నాడు.

2025, మార్చి 4న దుబాయ్‌లో ఆస్ట్రేలియాతో ఆడిన ఛాంపియన్స్‌ ట్రోఫీతో కలిపి ఛేదనలో కోహ్లి చేసిన పరుగులు 8063.

వన్డేల్లో ఛేదనలో ఎనిమిది వేలకుపైగా పరుగులు చేసిన రెండో ఆటగాడి కోహ్లి నిలిచాడు.

159 ఇన్నింగ్స్‌లోనే అతడు ఈ ఘనత అందుకున్నాడు. సచిన్‌ (232 ఇన్నింగ్స్‌లో 8720) ముందున్నాడు.