అత్యంత విజయవంతమైన భారత టెస్టు కెప్టెన్‌గా పేరొందిన విరాట్ కోహ్లి ఆ ఫార్మాట్ నుంచి రిటైరవుతున్నట్లు 2025, మే 12న ప్రకటించాడు.
2024లో టీమ్‌ఇండియా టీ20 ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన కోహ్లి.. ఆ తర్వాత ఆ ఫార్మాట్ నుంచి రిటైరయ్యాడు.
ఇక అతడు వన్డే ఫార్మాట్లో మాత్రమే ఆడతాడు.
భారత 269వ టెస్టు ఆటగాడిగా 2011లో అరంగేట్రం చేసిన విరాట్.. 123 టెస్టుల్లో టీమ్‌ఇండియాకు ప్రాతినిధ్యం వహించాడు.
30 శతకాలతో 9230 పరుగులు చేశాడు.
ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీలో ఆడిన అయిదో టెస్టే కోహ్లికి చివరి టెస్టు.
కోహ్లి 2027 వన్డే ప్రపంచకప్ వరకు వన్డేల్లో కొనసాగే అవకాశముంది.