వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 14,000 పరుగులు చేసిన బ్యాటర్‌గా భారత సూపర్‌స్టార్ విరాట్ కోహ్లి రికార్డు సృష్టించాడు.
2025, ఫిబ్రవరి 23న పాకిస్థాన్‌పై వ్యక్తిగత స్కోరు 15 వద్ద అతడు ఈ మైలురాయిని అందుకున్నాడు.
సచిన్ (18,246), సంగక్కర (14,234) తర్వాత వన్డేల్లో 14 వేలు పూర్తి చేసిన మూడో బ్యాటర్‌గా కోహ్లి నిలిచాడు.
సచిన్ 350 ఇన్నింగ్స్‌ల్లో, సంగక్కర 378 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయికి చేరుకోగా, కోహ్లి అందుకు 287 ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించాడు.