అమెరికా ఐటీ కంపెనీ వర్చూసా కార్పొరేషన్ అధ్యక్షుడు, సీఈఓగా భారత సంతతికి చెందిన నితీశ్ బంగా నియమితులయ్యారు.
ఇప్పటివరకు ఆ స్థానంలో ఉన్న సంతోష్ థామస్ రాజీనామా చేయడంతో ప్రస్తుత నియామకం జరిగింది.
నితీశ్ 20 ఏళ్లకు పైగా ఇన్ఫోసిస్‌లో వివిధ హోదాల్లో పనిచేశారు. వర్చూసా కార్పొరేషన్‌లో చేరే ముందు హిటాచీ గ్రూప్ కంపెనీ అయిన గ్లోబల్ లాజిక్‌లో పనిచేశారు.