Published on Apr 3, 2025
Current Affairs
వరంగల్‌ చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు
వరంగల్‌ చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు

వరంగల్‌ చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు (జీఐ) లభించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌ రిజిస్ట్రీ నుంచి 2025, ఏప్రిల్‌ 2న ధ్రువీకరణ పత్రం అందించింది.

తెలంగాణ నుంచి జీఐ గుర్తింపు పొందిన వాటిలో వరంగల్‌ చపాటా మిరప 18వది.

పలు ప్రత్యేకతలు ఉన్న వరంగల్‌ చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు కోసం వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలం తిమ్మంపేట మిరప రైతు ఉత్పత్తిదారుల సంఘం, మహబూబాబాద్‌ జిల్లా మల్యాలలోని ఉద్యాన పరిశోధన కేంద్రం, కొండా లక్ష్మణ్‌ వర్సిటీ.. జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌ రిజిస్ట్రీకి దరఖాస్తులు సమర్పించాయి.

వీటిపై అధ్యయనం చేసిన రిజిస్ట్రీ తాజాగా భౌగోళిక గుర్తింపునకు ఆమోద ముద్ర వేస్తూ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేసింది.