ప్రభుత్వరంగ సంస్థకు చెందిన వరంగల్‌లోని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తాత్కాలిక ప్రాతిపదికన ఆఫీస్ స్టాఫ్, ఫీల్డ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
వివరాలు:
ఆఫీస్ స్టాఫ్ (అకౌంట్స్)
ఆఫీస్ అసిస్టెంట్ (జనరల్)
ఫీల్డ్ స్టాఫ్
అర్హత: పోస్టును అనుసరించి 50% మార్కులతో ఏదైనా డిగ్రీ లేదా సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీకాం ఉత్తీర్ణత ఉండాలి.
జీతం: నెలకు ఆఫీస్ స్టాఫ్ పోస్టులకు రూ.25,500; ఫీల్డ్ స్టాఫ్ పోస్టులకు రూ.37,000.
వయోపరిమితి: 01-09-2025 నాటికి 35 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ అభ్యర్థులకు ఐదు, మూడేళ్లు వయసులో సడలింపు వర్తిస్తుంది.
ఇంటర్వ్యూ తేదీ: 22-09-2025.
వేదిక: ది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, #16-10-52 యేల్స్ హైట్స్ బిల్డింగ్, సాయి కన్వెన్షన్ పక్కన, వరంగల్ రైల్వే స్టేషన్ గేట్ దగ్గర, ప్లాట్‌ఫామ్ నంబర్ 3, శివనగర్ వరంగల్.
Website:https://cotcorp.org.in/?AspxAutoDetectCookieSupport=1